- పొలీసుల దాడిలో పట్టుబడిన తొమ్మిది మంది పేకాట రాయుళ్లు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పై నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై పొలీసులు దాడి నిర్వహించారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. నిజామాబాద్ ఒకటవ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి ఆధ్వర్యంలో పొలీసులు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బిల్డింగ్ పై అంతస్తులో ఒక గదిలో పేకాట అడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడి నిర్వహించారు.

గత కొంత కాలంగా లక్ష్మారెడ్డి అనే వ్యక్తి జూదగాళ్లను ఒక్క చోట చేర్చి పేకాట ఆడిస్తున్న వైనం బట్టబయలైంది. పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుని వారివద్ధ నుంచి రూ.40, 000 , సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతు పట్టుబడిన వారిలో చాల మంది రెగ్యూలర్ ప్లేయర్ లుగా గతంలో స్టార్ హోటల్ లలో జరిగిన పోలీసు దాడులలో పట్టుబడిన వారు ఉండటం గమనార్హం. రాత్రి వరకు కీలక సూత్రదారుల పేర్లు బయటకు రాకుండా ఉంచేందుకు పోలీస్ వర్గాలు సైతం వివరాలను బయటకు వెల్లడించకపొవడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరిని తప్పించారని గుస గుసలు వినిపిస్తున్నాయి.

