26.3 C
Hyderabad
Monday, August 3, 2026

బిల్డింగ్ పై నుంచి పడి మహిళ మృతి

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  బట్టలు ఆర వేయడానికి రెండో అంతస్తుకు వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తు భవనంపైనుంచి పడి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.  నాల్గవ టౌన్ ఎస్ఐ ఉదయ్ తెలిపిన వివరాల ప్రకారం… బోర్గాం ( పి)  కి చెందిన కాలూరి నిహరిక మంగళవారం మధ్యాహ్నం బట్టలు ఆరవేయడానికి భవనం పై భాగానికి వెళ్లి ప్రమాదవశాత్తు జారీ పడింది. దాబాపై నుండి  క్రింద  పడినందువలన బలమైన గాయాలతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నిహరిక చనిపోయింది అని మృతురాలి అన్న మురళి  ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాలురి విజయ్ కుమార్, నిహరిక దంపతులకు ముగ్గురు పిల్లలు. గత ఏడు సంవత్సరాలుగా నిహరిక మానసీక రుగ్మతతో బాధపడుతున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

More articles

Latest article