29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

గంట పాటు పని నిలుపుదలతో విద్యుత్ ఉద్యోగుల నిరసన

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపుమేరకు ఛత్తీస్ ఘడ్, ఉత్తర్ ప్రదేశ్ లలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు గంటపాటు పని నిలుపుదల తో నిరసన తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పవర్ హౌజ్ కాంపౌండ్ లో విద్యుత్ ఉద్యోగుల జేఎసీ అధ్వర్యంలో కరెంటు ఉద్యోగులు మంగళవారం మధ్యాహ్న 12 గంటల నుంచి 1 గంటల వరకు పని నిలుపుదల ధర్నా కార్యక్రమం నిర్వహించారు. జేఏసీ రాష్ట్ర నాయకులు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో నోయిడా ఢిల్లీలో, బొంబాయిలో ప్రైవేటైజేషన్ గతంలో చేసినప్పుడు లాసెస్ గాని, వినియోగదారులకు సరైన సేవలు అందించక ప్రైవేటీకరణ నిలిచిపోయిందన్నారు. గతంలో కూడా ఉత్తరప్రదేశ్లో ప్రైవేటీకరణ చేస్తామని పిలుపునివ్వగా దానికి భారత దేశవ్యాప్తంగా నిరసన వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడంతో ప్రైవేట్ కార్యక్రమం నిలిచిపోయింది. మరొకసారి ప్రభుత్వం ముందుకు వస్తుంది దాన్ని కూడా ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఉద్యోగస్తులకే కాదు ప్రజలకు కూడా చాలా నష్టం జరుగుతుంది. వ్యవసాయదారుకులకు రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో వరి ధాన్యాలు పంట కూడా మొత్తం దేశంలోని అందరికంటే అత్యధికంగా పండించడం జరిగింది. సబ్సిడీ రేట్లపై గృహ వినియోగదారులకు అందిస్తున్నటువంటి విద్యుత్తు సబ్సిడీ పోతుంది కాబట్టి ప్రజలకు కూడా తీవ్ర నష్టం ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క ప్రైవేటీకరణ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని శ్రీనివాస్ అన్నారు.ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాజేంధర్ గౌడ్ ,పూదరి గంగాధర్, సురేష్, గంగారాం నాయక్,కాశీనాథ్, చంద్రశేఖర్, చెన్నయ్య , శ్రీనివాస్, ,శంకర్ గౌడ్ ,సునీత ,మదుమతి, ,నిజాముద్దీన్, , సతీష్ 200 మంది విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Electricity workers protest with stoppage of work for an hour

More articles

Latest article