27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా డి. సత్యానంద్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) రాష్ట్ర కార్యదర్శిగా నిజామాబాద్ జిల్లా వాసి డి. సత్యానంద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఓ రమేష్ జి గంగాధర్ లు తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ నెల 28 నుంచి 30 వరకు జరిగిన టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర 6వ మహాసభలు విద్యారంగ పరిణామలు, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్చలు చేశారు.. అనంతరం రానున్న రెండు సంవత్సరాల కోసం రాష్ట్ర కమిటీని ,రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ లో జిల్లావాసి డి.సత్యానంద్ ని ఐదోసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల జిల్లా కమిటీ హర్షం  వ్యక్తం చేసింది.

More articles

Latest article