26.3 C
Hyderabad
Monday, August 3, 2026

భూమిని అక్రమంగా కబ్జా చేసిన వారిపై చర్య తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : తమ పొలానికి వెళ్లే బండ్ల బాటను అక్రమంగా కబ్జాచేసి ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తిపై చర్య తీసుకోవాలని సోమవారం కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ కు వినతి పత్రం అందజేశారు.  కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో రాజంపేట గ్రామ శివారులో గల సర్వేనెంబర్ 648, వెనుక గల సర్వే నంబర్లలో 25మందికి చెందిన వ్యవసాయ భూములు ఉన్నాయి.  జూకంటి మోహన్ రెడ్డి తండ్రి సర్వేనెంబర్ ఈ సర్వే నంబర్ ముందు భాగంలో 648/ఋ /1/2/1లో 0-10.50 గుంటలు, సర్వే నంబర్ 648/ఋ/2/1లో 1-00 ఎకరము గుంటలు ఖరీదు చేశాడు. ఈ భూమి నుండి మా భూమి లోకి మా తాతల కాలం నుండి బండ్లబాట ఉన్నది. ఈ బాటలోనే మా వ్యవసాయ ఎడ్ల బడ్లు,  వ్యవసాయ దారులు వెళ్లేవారు. జుకంటే మోహన్ రెడ్డి అక్రమంగా కబ్జా చేసి కడీలు పాతి ప్రే కాస్ట్ వాళ్లను నిర్మించాడు. దీనిలో మా భూమి లోకి మేము వెళ్లడానికి కనీసం నడవడానికి కూడా దారి లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎట్టిబండ్ల బాటకు అక్రమ కబ్జా నుండి విడిపించి తమకు న్యాయం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో పిట్ల శ్రీను, పిట్ల స్వామి, సదుల శివ, పిట్ల నర్సింలు, పిట్ల నరేష్ పాల్గొన్నారు.

More articles

Latest article