25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

మహారాష్ట్ర మద్యం పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

అక్రమంగా మద్యం తరలిస్తున్న ఒకరి  అరెస్టు

బిచ్కుంద, బతుకమ్మ : అక్రమంగా మద్యం తరలిస్తున్న ఒకరిని అరెస్టు చేసినట్లు బిచ్కుంద ఎస్ఐ నగేష్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుంద మండలంలోని మెనూర్ నుంచి డోంగ్లీ వెళ్లే రోడ్డులో సోమవారం ఎక్సైజ్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మోఘ గ్రామానికి చెందిన బిజల్వార్ నగేష్ తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై అక్రమంగా దేశిదారు మద్య తరలిస్తూ పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 48 దేశిదారు మద్య సీసాలను, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుళ్లు పరశురాం, శ్రీకాంత్ పాల్గొన్నారు.

More articles

Latest article