30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సోమావతి అమావాస్య పురస్కరించుకొని సోమవారం రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. పలువురు జంట దంపతులు హోమంలో పాల్గొని హోమాలు నిర్వహించారు. వేద బ్రాహ్మణుల సమక్షంలో శివపార్వతుల కళ్యాణం జరిపించారు. అనంతరం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అదేవిధంగా ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మహిళలు, చిన్నారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Special Pujas at Sri Venkateswara Swamy Temple

More articles

Latest article