- కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూశర్మ
బాన్సువాడ, బతుకమ్మ: పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం ఆమె బాన్స్ వాడ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొత్తగా విధుల్లోకి చేరిన కానిస్టేబుళ్లకు వారి విధి విధానాల గురించి అవగాహన కలిగించారు. ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని సూచించారు. ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలని, బాధితులకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ ని సంప్రదించవచ్చుని అన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం నేరాలు తగ్గుముఖం పట్టాయని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న కేసుల గురించి, పెండింగ్ ఉన్న కేసులపై రివ్యూ చేశారు. పోలీస్ స్టేషన్ ల పరిధిలోని కేసుల నమోదు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ఈస్ట్ గా ప్రతి దరఖాస్తు పై తప్పనిసరిగా పిటిషన్ మేనేజ్మెంట్ లో జనరేట్ చేసినా రిసిప్ట్ ఇవ్వాలని సూచించారు. అనంతరం సిబ్బంది తో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ అంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి అధికారులకు సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టి కి తీసుకొని రావాలి అని సూచించారు. నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేసారు. పోలీసు స్టేషన్ లో అన్ని రకాల విధులను సక్రమంగా నేర్చుకోవాలన్నారు. రికార్డ్ నిర్వహణ, సీసీటీఎన్ఎస్, రిసెప్షను, కోర్టు డ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, సమన్లు మొదలుగు విధులను సీనియర్ల ద్వారా తెలుసుకోవాలన్నారు. నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ డిఎస్పి సత్యనారాయణ, బాన్సువాడ ఎస్ హెచ్ ఓ ఎం. అశోక్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
