బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి
కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూశర్మ బాన్సువాడ, బతుకమ్మ: పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం ఆమె బాన్స్ వాడ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొత్తగా విధుల్లోకి చేరిన కానిస్టేబుళ్లకు వారి విధి విధానాల గురించి అవగాహన కలిగించారు. ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని సూచించారు. ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర...