25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

హెల్మెట్ ధారణ పై ప్రజల్లో అవగాహన 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15 నుంచి ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా తమ వాహనాలు నడిపి సమయంలో హెల్మెట్లు ధరించాలని కఠినంగా నిబంధనలు విధించారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలోని నాల్గవ టౌన్ పరిధిలో సిఐ నరహరి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతపై నాలుగో టౌన్ పోలీసులు ప్రజల్లో విస్తృతంగా అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తే ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని, హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోవడమే కాకుండా తమ తమ కుటుంబాలకు తీరని వేదనను మిగులుస్తారని దయచేసి ప్రతి ఒక్కరూ తమ ద్విచక్ర వాహనాలను నడపాలని సీఐ కోరారు.

Public awareness on wearing helmet

More articles

Latest article