ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో ఏఎంసీ చైర్మన్ ముప్పాగంగారెడ్డి, పీసీసీ డెలిగేటు శేఖర్ గౌడ్, ఇందల్వాయి మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, డిచిపల్లి మండల అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, దర్పల్లి అధ్యక్షులు చిన్న బాలరాజ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
