29 C
Hyderabad
Monday, August 3, 2026

ఎఫ్ పీ ఓ ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రముఖ న్యాయవాది టక్కరి హనుమంత్ రెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ:  భారత వ్యవసాయ అభివృద్ధికి రైతులను సంఘటిత పరిచి వారి ఉత్పత్తులను వారే అమ్ముకునే విధంగా రైతు ఉత్పత్తిదారులు ఎఫ్ పీ ఓ లను కేంద్ర ప్రభుత్వం దేశంలో పదివేల ఎఫ్ పీ ఓ లను ఏర్పాటు చేసి లక్ష కోట్ల రుణాలు అందిస్తుందని మరింత అభివృద్ధి పరిచే విధంగా వాటిపై తగిన కృషి చేసి రైతులను ఆదుకోవాలని ప్రముఖ న్యాయవాది పి.హనుమంతు రెడ్డి (టక్కరి) అన్నారు.  నవీపేట కిషన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ప్రగతి నగర్ లోని  వారి నివాసంలో శుక్రవారం 2025 క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వాలు వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు తగిన కృషి చేయాలని అన్నారు. ఆహారమంతా విషతుల్యమవుతున్న ఈ సందర్భంలో ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు తగిన కృషి జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ పీ ఓ చైర్మన్ ఆర్.పృథ్వీరాజ్  మాట్లాడుతూ రైతులకు ఎఫ్ పీఓ లకు వారి ఉత్పత్తులను వాల్యూ ఎడిషన్ పొందాలని అన్నారు. ఇందులో సభ్యత్వం పొందిన రైతులను ప్రోత్సహించేందుకు గాను నాబార్డ్ వారు ఇన్పుట్ సబ్సిడీలను అందిస్తుందని అన్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు పరచాలని ఎన్సీఎస్ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించి బెల్లం కేంద్రంగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులను పురుగుమందులను సబ్సిడీపై అందించాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఎఫ్ పీ ఓ డైరెక్టర్లు కే. ముత్యం, బీ.సంజీవరెడ్డి, ఎం.సాయిలు, ఇందూరు డిచ్పల్లి డైరెక్టర్ వేల్పూర్ భూమయ్య, బి. బుల్లయ్య, ఏ.రాజారాం, సాయి ప్రసాద్,వి. రాజ్యలక్ష్మి,బి. రాజేశ్వర్, సీఈఓ అనీష్ రాజు, అకౌంటెంట్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

The central government should work for the development of FPOs

More articles

Latest article