కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి రైల్వేస్టేషన్ లో రాత్రి బాబాయితో పాటు నిద్రించిన బాలిక కనిపించకుండాపోయింది. బాలిక పినతండ్రి రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా అప్పారావుపేట్ కు చెందిన సిరిగోలే ఎర్రన్న తన అన్న కూతురు మహి(7)తో కలిసి ఈ నెల 24న హైదరాబాద్ వెళ్లేందుకు బయలుదేరారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో కామారెడ్డి రైల్వేస్టేషన్ కు వచ్చి రైలు మిస్ కావడంతో కౌంటర్ వద్దే నిద్రించారు. ఉదయం 6 గంటలకు మహి కనిపించకపోవడంతో చుట్టుప్రక్కల వెతికినా, బంధువులను ఆరా తీసినా తమ వద్దకు రాలేదని తెలుపడంతో బాధితుడు రైల్వేపోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు.
