30.9 C
Hyderabad
Monday, August 3, 2026

శ్రీరాం సాగర్ జలాశయం నుంచి కాకతీయ కాలువ కు యాసంగి పంటకు సాగు నీరు విడుదల

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ :

శ్రీరాం సాగర్ జలాశయం నుండి కాకతీయ కాలువకు యాసంగి పంట కొరకు సాగు నీటి విడుదల చేశారు. ప్రాజెక్టు వద్ద బుధవారం ఉదయం కాలువకు పూల సమర్పణ చేసిన పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాస రావు గుప్తా,  కార్యనిర్వహక ఇంజనీర్ చక్రపాణి, డీ ఈఈలు రఘుపతి, గణేష్, గంగా భూషణ్, ఏఈఈలు పాల్గొనగా బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి నీటి విడుదలను లాంచనంగా ప్రారంభించారు. అదే విధంగా లక్ష్మీకాలువకు 150  క్యూసెక్కుల నీటిని తెలంగాణ సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ప్రారంభించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి యాసంగి పంటకు లక్ష్మి ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల ప్రారంభించినట్లు తెలిపారు.  విలువైన సాగునీటిని వృధా చేయకుండా ఆయకట్టు రైతులందరూ పొదుపుగా వాడుకొని నీటిపారుదల శాఖతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Release of cultivation water from Sriram Sagar reservoir to Kakatiya canal for Yasangi crop

More articles

Latest article