శ్రీరాం సాగర్ జలాశయం నుంచి కాకతీయ కాలువ కు యాసంగి పంటకు సాగు నీరు విడుదల
మెండోరా, బతుకమ్మ : శ్రీరాం సాగర్ జలాశయం నుండి కాకతీయ కాలువకు యాసంగి పంట కొరకు సాగు నీటి విడుదల చేశారు. ప్రాజెక్టు వద్ద బుధవారం ఉదయం కాలువకు పూల సమర్పణ చేసిన పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాస రావు గుప్తా, కార్యనిర్వహక ఇంజనీర్ చక్రపాణి, డీ ఈఈలు రఘుపతి, గణేష్, గంగా భూషణ్, ఏఈఈలు పాల్గొనగా బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి నీటి విడుదలను లాంచనంగా ప్రారంభించారు. అదే విధంగా లక్ష్మీకాలువకు 150 క్యూసెక్కుల నీటిని తెలంగాణ సీడ్ డెవలప్ మెంట్...