27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని ఐదో పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగరంలో మంగళవారం ఒకరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఐదో టౌన్ ఎస్ఐ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని నాగారం పరిధిలో గల రాజీవ్ గృహకల్ప కోటర్స్ లో సాప భరత్(28) నివాసం ఉంటున్నాడు. లేబర్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పుల పాలై మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది మద్యం మత్తులో తన ఇంట్లోని ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article