కామారెడ్డి సిటీ, బతుకమ్మ: డా. బాబా సాహెబ్ అంబేద్కర్ పై భారత దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా చేసిన అనుచిత వాక్యాలను ఖండిస్తూ మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి వారు మాట్లాడుతూ.. భారతదేశ హోం మినిస్టర్ అమిత్ షా పార్లమెంటులో అంబేద్కర్ ని కించపరిచే వాక్యాలను ఖండించారు. అమిత్ షాపు వ్యతిరేకంగా నినాదాలు చేసి, కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి కు మెమోరామెన్ అందజేశారు. నీరడి ఈశ్వర్ న్యాయవాది, ఉపాధ్యక్షులు రాజేందర్, జుక్కల్ నియోజకవర్గం అధ్యక్షులు రోహిదాస్, కామారెడ్డి అసెంబ్లీ ఉపాధ్యక్షులు నత్తి జీవన్, బాన్సువాడ బిట్స్ ఇంచార్జ్ బండారి చరణ్, సాయిలు, దశరథ్, రాములు,గైన సాయిలు, శ్రీకాంత్, ప్రశాంత్, మారుతి తదితరులు ఉన్నారు.

