నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 ద్వారా నియామకం అయిన వార్డు అధికారులకు మంగళవారం వారి విధులు విధానాల పైన అవగాహన సమావేశం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు గ్రూప్ 4 ద్వారా నియామకమైన అధికారులకు ఉద్యోగపరంగా నిర్వర్తించాల్సిన విధులు, నియమాలపై పలు సూచనలు చేశారు. అదేవిధంగా తమ విధి నిర్వహణలో మున్సిపల్ కార్పొరేషన్ కు ఎలాంటి చెడు పేరు రాకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్, అదనపు కమిషనర్ శంకర్ హాజరయ్యారు.

