. . . మూడు చోట్ల దోంగతనం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ నగరంలొని హమాల్ వాడిలొ దొంగలు అలజడి రేపారు. అదివారం రాత్రి మూడవ టౌన్ ప్రాంతంలోని హమాల్ వాడిలో మూడు చోట్ల దోంగతనాలకు పాల్పడ్డారు. హమాల్ వాడిలోని ముదిరాజ్ సంఘం లొ, మైసమ్మ గుడి లో చోరిలకు పాల్పడ్డారు. సోమవారం ఉదయం ఈ విషయం వెలుగు లోకి వచ్చింది…

హమాల్ వాడిలోని మల్లారి అనురాద అనే మహిళ ఇంటిలో చోరికి పాల్పడ్డారు. గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం పగుళ గోట్టి 5 తులాల బంగారు నగలు, 25 తులాల వేండి నగలు . రూ.20 వేల నగధు, సాన్యొ కంపెని టివిని ఎత్తుకేళ్లారు. అదేవిధంగా మైసమ్మగుడిలొ ఇత్తడి విగ్రహంను ఎత్తుకేళ్లారు. తరువాత వాటిని దూరంగా వదిలి వేళ్లడం గమనార్హం.ముదిరాజ్ సంఘం తాళాలు పగుల గోట్టిన అక్కడ ఎమి దోరకపోవడంతో దోంగలు వెనుదిరిగారు. స్థానిక ఎస్ ఐ హరిబాబు ఘటన స్థలాన్న పరిశీలించారు. క్లూస్ టింను రప్పించి వివరాలు సేకరిస్తున్నారు.

