28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాకా వర్ధంతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సి.హెచ్. సింధూశర్మ ఆదేశాల మేరకు ఆదివారం నిజామాబాద్ కమీషన రేట్ కార్యాలయంలో వెంకటస్వామి(కాకా) వర్థంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్ )  జి. బస్వారెడ్డి వెంకటస్వామి (కాకా) చిత్ర పటానికి నివాళులు అర్పించారు.   ఈ సందర్భంగా అదనపు డి.సి.పి (అడ్మిన్) మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాల్లో అన్ని దశల్లోనూ స్ఫూర్తిని నిలిపారని అన్నారు.  పేదల పెన్నిదిగా పేరు గాంచారని తెలియజేశారు. భవిష్యత్ తరాలకోసం అనునిత్యం ప్రతిఒక్కరు కష్టపడాలని, భావి తరాల కోసం బంగారు బాట వేయాలని పోలీస్ శాఖ సిబ్బందికి పిలుపునిచ్చారు. ఈ వర్ధంతి సందర్బంగా సి. సి. ఆర్. బి ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్, ఎన్. ఐ. బి ఇన్స్పెక్టర్ ప్రసాద్ , రిజర్వు ఇన్స్ స్పెక్టర్ సతీష్ కుమార్, తిరుపతి , శ్రీనివాస్,  పోలీస్ కార్యాలయం సిబ్బంది, సి.సి.ఆర్.బి సిబ్బంది, సి.ఎస్.బి సిబ్బంది, ఐ.టి కోర్ సిబ్బంది ,కాంప్లెంటు సెల్ సిబ్బంది,  పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.

Kaka's death under the auspices of the police department

More articles

Latest article