పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాకా వర్ధంతి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సి.హెచ్. సింధూశర్మ ఆదేశాల మేరకు ఆదివారం నిజామాబాద్ కమీషన రేట్ కార్యాలయంలో వెంకటస్వామి(కాకా) వర్థంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్ ) జి. బస్వారెడ్డి వెంకటస్వామి (కాకా) చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు డి.సి.పి (అడ్మిన్) మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాల్లో అన్ని దశల్లోనూ స్ఫూర్తిని నిలిపారని అన్నారు. పేదల పెన్నిదిగా పేరు గాంచారని తెలియజేశారు. భవిష్యత్ తరాలకోసం అనునిత్యం...