29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

రైలు నుండి జారిపడి యువకుడు మృతి.

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్:

నవీపేట్ మండలం లోని ఫకీరాబాద్ రైల్వే స్టేషన్ సమీప ప్రాంతంలో రైలు నుండి ప్రమాదవశాత్తు జారిపడి బోధన్ కు చెందిన యువకుడు మృతి చెందాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం బోధన్ లోని ఆటోనగర్ ప్రాంతానికి చెందిన బాలాజీ(33) తన చెల్లెలు పూజతో కలిసి పర్భని ప్యాసింజర్ లో ప్రయాణిస్తుండగా ఫకీరాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్రంగా గాయపడడంతో అదే ట్రైన్ లో క్షతగాత్రుడిని బాసర కు తీసుకురాగా 108 అంబులెన్స్ సిబ్బంది పరిశీలించి మృతి చెందాడని నిర్దారించడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రైల్వే ఎస్సై సాయ రెడ్డి తెలిపారు.

More articles

Latest article