26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా మాజీ కేంద్ర మంత్రి వర్ధంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండల కేంద్రంలో గల ఆహర శాస్త్ర, సాంకేతిక కళాశాలలో ఆదివారం మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కళాశాల అసోసియేట్ డీన్ కే.వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన చేసిన సేవలను గురించి కొనియాడారు. అనంతరం కళాళాల విద్యార్థులు ఉపన్యాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article