15 జీవాలమృతి
బతుకమ్మ భిక్కనూరు: గొర్రెల మందపై కుక్కలు దాడి చేయగా 15 జీవాలు( మేకలు, గొర్రెలు) మృతి చెందిన సంఘటన భిక్కనూరు మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…పాత దళితవాడ సమీపంలో ని వ్యవసాయ భూమిలో కోకట్ల రాములు అనే వ్యక్తి మూడు నెలలుగా గొర్ల మందను పెట్టాడు. వారం రోజుల క్రితం కుక్కల దాడిలో 13 జీవాలు మృతి చెందగా, తాజాగా మరో 15 జీవాలు మృతి చెందడంతో గొర్ల కాపరి రాములు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. సమీపంలో కోళ్ల ఫారాలు ఉండడంతో, చనిపోయిన కోళ్లను విచ్చలవిడిగా పాడేయడం వల్ల తిన్న కుక్కలు, మంద పై దాడి చేస్తూ జీవాలను కరవడంతో మృతి చెందాయన్నారు. నిత్యం మంద పై కుక్కలు దాడి చేస్తూనే ఉన్నాయి.సుమారు 2 లక్షల రూపాయల నష్టం ఇప్పటివరకు వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
గొర్రెల మందపై కుక్కల దాడి
