రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన ఓ యువకునికి దేహ శుద్ధి చేసిన ఘటన రుద్రూర్ లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రుద్రూర్ గ్రామానికి చెందిన ఒక యువకుడు లవ్ జిహాద్ పేరుతో అదే గ్రామానికి చెందిన ఓ వివాహితను లోబర్చుకున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గత మూడు నెలలుగా ఆ వివాహితకు మాయమాటలు చెప్పి మత మార్పిడి చేసేందుకు యత్నించాడు. శనివారం ఆ యువకుడు కనబడడంతో రుద్రూర్ బస్టాండ్ ప్రాంగణంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ముందు క్షమాపణలు చెప్పించి, దేహ శుద్ధి చేసి, పోలీసులకు అప్పజెప్పినట్లు భాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఆ యువకుని పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు భాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
