బతుకమ్మ,మోర్తాడ్: ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ, హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్ట్ చెయ్యాలని చూస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోర్తాడ్ బీఆర్ఎస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని బీ ఆర్ ఎస్ నాయకులు అన్నారు. శుక్రవారం మోర్తాడ్ మండల కేంద్రంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఏదో ఒక విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న లక్ష్యంతో, అక్రమ కేసులతో కక్ష సాధింపులకు దిగుతున్నారన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా.. ఇలాంటి ఉడత ఊపులకు బెదిరేది లేదు అని మా మోర్తాడ్ మండల బీఆర్ఎస్ పార్టీ తరపున హెచ్చరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మోర్తాడ్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కల్లెడ ఏలీయా, మోర్తాడ్ సొసైటీ చైర్మన్ కళ్లెం అశోక్, పాపాయి పవన్, భోగ ఆనంద్, కొండ్రికల్లా రాజేశ్వర్,గంధం మహిపాల్,పర్స గంగన్న, మామిడి రాజిరెడ్డి,మహేష్, దాసు పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
