24 C
Hyderabad
Sunday, August 2, 2026

అమిత్ షా అనుచిత వ్యాఖ్యల్నిఖండించిన అంబేడ్కరైట్లు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్: రాజ్యాంగంపై ఓ పక్క చర్చ జరుపుతూనే తాము గౌరవిస్తున్నమంటునే అదే రాజ్యాంగ నిర్మాతఐన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పై రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత దిగ్భ్రాంతికరమని  అంబేద్కర్ వాదులు అన్నారు. ఇది వారి మనువాద దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు. అమిత్ షా దేవుని పేరును పదే పదే జపించినంత మాత్రాన ఎవరు స్వర్గానికి పోరు. విశ్వంలో ఉన్న ప్రాణులన్నింటిపై సోదరభావం, సమానత్వం కలిగి ఉండడమే మీరు అనుకుంటున్న స్వర్గానికి బాటలు వేస్తుంది. అంతేగాని మీలాంటి విద్వేషపరులు కోటి సార్లు జపించిన జరగదు. ఇలాంటి సంకుచిత, విద్వేషపూరిత మనస్తత్వామం గల మీకు రాజ్యాంగ బద్దమైన ఎలాంటి పదవిలో కొనసాగే అర్హత లేదని అంబేడ్కర్ వాదులు విమర్శించారు.

నేటి నిరసన ప్రదర్శనకు తరలిరండి 

నవంబరు 20 శుక్రవారం ఉదయం 11:గంటలకు మోర్తాడ్ మండల కేంద్రంలో నిరసన ధర్నా కార్యక్రమం కలదు. దీనిని మండల దళిత సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు, అంబేడ్కర్ యువజన సంఘాల అధ్వర్యంలో నిర్వహించ తలపెట్టారు. అయితే మండలంలోని ప్రజలందరు భారీఎత్తున నల్ల జెండాలతో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article