అమిత్ షా అనుచిత వ్యాఖ్యల్నిఖండించిన అంబేడ్కరైట్లు
బతుకమ్మ, మోర్తాడ్: రాజ్యాంగంపై ఓ పక్క చర్చ జరుపుతూనే తాము గౌరవిస్తున్నమంటునే అదే రాజ్యాంగ నిర్మాతఐన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పై రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత దిగ్భ్రాంతికరమని అంబేద్కర్ వాదులు అన్నారు. ఇది వారి మనువాద దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు. అమిత్ షా దేవుని పేరును పదే పదే జపించినంత మాత్రాన ఎవరు స్వర్గానికి పోరు. విశ్వంలో ఉన్న ప్రాణులన్నింటిపై సోదరభావం, సమానత్వం కలిగి ఉండడమే మీరు అనుకుంటున్న స్వర్గానికి బాటలు వేస్తుంది. అంతేగాని మీలాంటి విద్వేషపరులు...