28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

రెండు సర్వే రిపోర్టుల ఎఫెక్ట్

Must read

📰 Generate e-Paper Clip

. . . సర్వేయర్ కు మెమో జారీ
నిజామాబాద్ , బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సర్వేయర్ స్వప్నకు తహసీల్ధార్ కు మెమో జారీ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మోపాల్ మండలం సిర్పూర్ గ్రామ శివారులోని అవదూత నిర్మలానంద స్వామికి 1984లో కేటాయించిన అసైన్డ్ భూమి సర్వే కోసం దరఖాస్తు చేశారు. 2019 కరోనా కాలం నుంచి తన వ్యవసాయ క్షేత్రాన్ని కౌలు చేస్తున్న వారు చెరబట్టడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ పొందారు. కానీ గ్రామానికి చెందిన అధికార పార్టీ నేతలు దానిని కబ్జా చేయడంతో మరోసారి అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. అవదూత నిర్మలానంద స్వామి వినతి మేరకు సర్వే చేసిన మండల సర్వేయర్ సర్వే చేశారు. ఆ సమయంలో అక్కడ కబ్జాలో ఉన్న వారికి కూడా నోటీసులు ఇవ్వడంతో అక్కడ గలాట జరిగింది. సంబంధిత భూమికి, సర్వే నంబర్ లలో ఉన్న భూమికి ఎలాంటి సంబంధం లేదని స్వామి మరోసారి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈసారి ఏడికి ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాలతో మళ్ళీ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించినా అప్పటికి రెండు పార్టీలు కూర్చోని మాట్లాడుకుంటే తాను సర్వే చేస్తానని చెప్పడంతో ఆయన అంగీకరించారు. కానీ అప్పటికి కూడా సర్వేలలో పోజిషన్ గుర్తించకపోవడంతో జిల్లా కలెక్టర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. అయితే సంబంధిత భూమి సర్వే విషయంలో ఎమ్మార్వోకు తాను స్థానికంగా మోపాల్ లోని సంబంధిత భూమిలో సర్వే చేయలేదని ఒకసారి, ఏడికి ఇచ్చిన రిపోర్టులో తాను సర్వే చేసినట్లు స్వయంగా సర్వేయర్ సమాచారం అందించారు. ఈ విషయంలో బాధితులు సహ చట్టం ప్రకారం సంబంధిత కాపీలను సంపాదించి సర్వేయర్ పై చర్యలు తీసుకోవాలని గత నెల 25న మోపాల్ తహసీల్ధార్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్వామి ఫిర్యాదు మేరకు మోపాల్ తహసీల్ధార్ సర్వేయర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కానీ ఇప్పటి వరకు వాటిపై సమాదానం చెప్పలేదని ఎమ్మార్వో తెలిపారు. ఈ విషయంలో శాఖపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి ఉన్నతాధికారులకు రిపోర్టు ఇస్తామని తహ సీల్ధార్ తెలిపారు. ఇదిలా ఉండగా 1984 నుంచి సంబంధిత భూమిలో ఉండి వ్యవసాయం చేస్తున్న అసలైన యజమానులైన తమను కాదని ఎలాంటి రికార్డులు లేని కబ్జాదారులకు సర్వేయర్ వంతపాడటంపై ల్యాండ్ సర్వే ఏడితో పాటు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు.

More articles

Latest article