32.7 C
Hyderabad

బాలికల పాఠశాల తనిఖీ

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల ను ఆర్డీవో మన్నెం ప్రభాకర్ బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థినులకు భోజనం మెనూ ప్రకారం అందించడం లేదని, బుధవారం కోడి గుడ్డు ఇవ్వడం లేదని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులను ఆర్డీవో ప్రశ్నించగా, డబ్బులు లేవని వారు సమాధానం ఇవ్వడం తో  ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్ల రిజిస్టర్లను తనిఖీ చేశారు. ముగ్గురు టీచర్లు సీఎల్ పెట్టి డుమ్మా కొడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. ఈ పరిస్థితికి హెచ్ఎం సమయపాలన పాటించకపోవడమే కారణమని ఆర్డీవో అన్నారు.

Inspection of Girls' School

 

More articles

Latest article