నుడా ఛైర్మెన్ కేశ వేణు
నిజామాబాద్, బతుకమ్మ: మదర్ హుడ్ ఆసుపత్రి, నిజామాబాద్ వారి మూడవ వార్షికోత్సవ సందర్భంగ మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నూడ చైర్మన్ శ కేశవేణు మాట్లాడుతూ రక్తదాన శిబిరానికి యువత పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషం అన్నారు. రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ యువతకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జమియత్ ఉలమా-ఏ-హింద్ అధ్యక్షుడు హఫీజ్ లయాఖ్ ఖాన్ మాట్లాడుతూ, రక్తదానం మన సమాజానికి ప్రాణదానం చేస్తుందని, ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఏం పి జే అధ్యక్షుడు జహీరు ద్దీన్, జమాత్-ఎ-ఇస్లామీ హింద్ ప్రతినిధి షేక్ హుస్సైన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదాతలను అభినందించారు.

కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషం. ఎంతో ఉత్సాహంతో రక్తదానానికి ముందుకు వచ్చిన యువకులను ముఖ్య అతిథులు, ఇతర ప్రముఖులు ప్రశంసించారు. ఈ శిబిరం ద్వారా సేకరించిన రక్తం రెడ్ క్రాస్ సొసైటీ ద్వార అవసరమైన వారికి ముఖ్యంగా తలసినియ రోగులకు ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ రక్తదాన శిబిరం నిర్వహణకు సహకరించిన ఆసుపత్రి సిబ్బంది, యువత మరియు దాతలకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

