25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

చిన్నచిన్న బిల్లులూ మంజూరు చేయడం లేదు

Must read

📰 Generate e-Paper Clip

. ఆరు గ్యారెంటీలు, 13 హామీల ఊసేలేదు

. అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్, బతుకమ్మ: సీడీపీ, ఎస్ డీఎఫ్ ద్వారా చేపట్టిన చిన్నచిన్న పనులకు సంబంధించి బిల్లులను ప్రభుత్వం ఎందుకు మంజూరు చేయడం లేదని అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇది ఒక్క తన నియోజకవర్గం బాల్కొండది మాత్రమే కాదని మొత్తం రాష్ర్ట వ్యాప్త సమస్య అని పేర్కొన్నారు. పాఠశాలలు, కుల సంఘాలు, మహిళా సంఘాలకు సంబంధించి చేపట్టిన పనులను కాంట్రాక్టర్లు చేపట్టలేదని, విద్యా కమిటీలు, ఆయా కుల సంఘాలు, మహిళా సంఘాల వాళ్లు డబ్బులు పోగుచేసి కట్టుకున్నారన్నారు. చిన్నచిన్న బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేపట్టిన వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఒక్క పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని, ఆరు గ్యారెంటీలు, 13 హామీలన ఊసేలేదన్నారు. రాష్ర్టానికి ఆదాయం ఉన్నా సంవత్సర కాలంలో రూ.లక్షా 27వేల కోట్ల అప్పులు తీసుకొచ్చారని అన్నారు.

More articles

Latest article