25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పాన్ కిక్కులో యువకుడి హత్య 

Must read

📰 Generate e-Paper Clip

  • 👉 యువకుడి పై దాడి చేసిన ఐదుగురు 
  • 👉 గోశాల వద్ద యువకుడి మర్డర్ కేసులో సంచలన విషయాలు 

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాన్ కు ఉన్న డిమాండ్ మరేక్కడ ఉండదు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్ కండిషన్ పాన్ షాపులు కనిపిస్తాయి. అక్కడ దొరికే పాన్ మసాలా మరి ఎక్కడ దొరకదు. ఆ పాన్ ల కోసం పదో తరగతి విద్యార్థి మొదలుకొని పండు ముసలి వరకు ఆ పాన్ షాప్ ల వద్ద క్యులు కడతారు. రాత్రి అయిందంటే చాలు మద్యం దుకాణాల వద్ద కనిపించని సందడి పాన్ షాప్ ల వద్ద కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పాన్ లలో ఉండే గమ్మత్తు కోసం ఎవరు ఏమైనా చేయడానికి వెనుకాడరు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి పాన్ షాప్ వద్ద జరిగిన మర్డర్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మిర్చి కాంపౌండ్ కు చెందిన చంద్రకాంత్ గైక్వాడ్ తన స్నేహితుడితో కలిసి గోశాల వద్ద ఉన్న పాన్ షాప్ ముందు నుంచి నడుచుకుంటూ వెళుతున్నాడు. అప్పుడే పాన్ షాప్ లో పాన్ తిన్న ఐదుగురు యువకులలో ఒకరి బైకు చంద్రకాంత్ చేతికి తగిలింది. బైక్ తీసేటప్పుడు చూసుకోవద్దా అని అడిగినందుకు చంద్రకాంత్ పై ఐదు యువకులు దాడి చేసి కొట్టారు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చంద్రకాంతం పక్కనే ఉన్న డ్రైనేజీలో విసిరేశారు గాయాలు తీవ్రం కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించిన లాభం లేకపోయింది అప్పటికే చంద్రకాంత్ చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. పాన్ కిక్కులో యువకులు ఇష్టం వచ్చినట్టు కొట్టడంతోనే చంద్రకాంత్ మరణించినట్టు తేలింది. యువకులు పరాయి కాగా వారి కోసం గాలిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దాడికి పాల్పడిన ఐదుగురు యువకుల్లో ఒకరు ఆర్మీలో పని చేస్తున్నట్టు తెలిసింది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు యువకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాన్ లో ఉన్న గ’మ్మత్తు”  ఏమిటో తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. యువకులు పాన్ లకు బానిసలు అవడం ఏమిటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. కొందరు పాన్ షాప్ ల నిర్వాహకులు తమ గిరాకిని పెంచుకునేందుకు పాన్ మసాలా స్థానంలో మత్తు పదార్థాలను కలుపుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. అందుకే విద్యార్థులు మొదలుకొని పండు ముదుసలి వరకు పాన్లు లేకుంటే పొద్దు గడపద అన్నట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఈ విషయంలో పోలీస్ ఎక్సైజ్ శాఖలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

More articles

Latest article