24.7 C
Hyderabad
Monday, August 3, 2026

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

Must read

📰 Generate e-Paper Clip

డిచ్పల్లి, బతుకమ్మ : డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో గత పది రోజుల క్రితం దుబాయికి వలస వెళ్లిన కార్మికుడు గుండెపోటుతో చనిపోయాడు. వారి కుటుంబానికి సుద్దపల్లి గ్రామ యువజన సంఘాలు అదేవిధంగా చుట్టుపక్కన గ్రామ యూత్ సంఘాలు స్పందించి తక్షణ సహాయం కింద వారి కుటుంబానికి సోమవారం బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో చందాల రూపంలో జమ చేసిన మొత్తం రూపాయలు 62,300 వారి భార్య రాజమణికి అందజేశారు.  ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఈ నూతన ప్రభుత్వం గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షలు ప్రకటించారని, సుద్దపల్లి గ్రామానికి చెందిన మేకల హరీష్ కి తొందరగా వారి కుటుంబానికి అందించాలని  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి ని కోరారు. ఈ  కార్యక్రమంలో సుద్ధపల్లి గ్రామ యువజన సంఘ సభ్యులు వినోద్ రెడ్డి, రాజు, ఆనంద్, అబ్బన్న,బుజ్జి ,సృజన్, హరీష్ ,కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article