25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

మాల సంపన్నుల కు అండగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి జిల్లా ఇన్చార్జి మంథని సామేల్ మాదిగ

బతుకమ్మ : నాగరెడ్డిపేట్ : రాష్ట్రంలో మాల సంపన్నులకు అండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను తప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ వర్గీకరణ విషయంలో కాలయాపన చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా ఇన్చార్జి మంథని సామెల్ మాదిగ ఆరోపించారు. సోమవారం నాగిరెడ్డిపేట మండలం కేంద్రంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం సమావేశంలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు కోసం మాదిగలు, మాదిగ ఉపకులాలు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఆసన్నమైందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వర్గీకరణ అమలు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాల సంపన్నుల కొమ్ముకాస్తున్నాడని వర్గీకరణ అమలు చేసేంతవరకు మాదిగలు ఇతర ఎస్సీ కులాలు రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితిలేదని గుర్తు చేశారు. సామాజిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ముప్పై ఏళ్ల మాదిగల పోరాటం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా విజయం సాధిస్తే దాని అమలుకు అడ్డు పడుతూ కొంతమంది స్వార్ద పర సంపన్న మాల వర్గాలు కుట్రలు చేస్తున్నారని ఎంతమంది అడ్డు వచ్చినా వర్గీకరణ ఆగదని అందుకు యావత్తు మాదిగ జాతి సిద్దం కావాలని కోరారు. వేయి గొంతులు లక్ష డప్పులతో జనవరి 27 న హైదరాబాద్ లో మాదిగ కళాకారుల మహాప్రదర్శన ఉంటుందని దానిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాగిరెడ్డిపేట మండల అధ్యక్షులు తొంట సాయిలు మాదిగ, సీనియర్ నాయకులు కంతి పద్మారావు మాదిగ, కుంటోళ్ల యాదయ్య, బట్టు వెంకటరాములు మాదిగ, జిల్లా మహిళా అధ్యక్షురాలు సట్టిగారి లక్ష్మి మాదిగ, బానాపురం లావణ్యమాదిగ, కుంటోళ్ళనాగరాజు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article