25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రాష్ట్ర స్థాయిలో రాణించాలి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి పట్టణంలోని ఇందిర ప్రియదర్శిని ఆడిటోరియంలో చీఫ్ మినిస్టర్స్ కప్ – 2024 జిల్లాస్థాయి పోటీలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభకనబర్చి రాష్ర్టస్థాయిలో రాణించాలన్నారు. జిల్లా స్థాయి పోటీలు సోమవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. 16 ఈవెంట్స్ లో 323 మంది క్రీడాకారులు జిల్లా స్థాయిలో పాల్గొంటున్నారని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు 8వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారని వివరించారు. కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియ మాట్లాడుతూ జిల్లాలోని 25 మండలాల నుంచి సీఎం కప్ క్రీడాపోటీల్లో 8 వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారని, చదువుతో పాటు సాంస్కృతిక రంగం, క్రీడల్లో రాణించాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రంగనాథ్ రావు, వార్డ్ కౌన్సిలర్ వనిత రాం మోహన్, జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్స్, పీఈటీలు, క్రీడా అసోసియేషన్ ల ప్రతినిధులు, క్రీడా కారులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article