రాష్ట్ర స్థాయిలో రాణించాలి

కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి పట్టణంలోని ఇందిర ప్రియదర్శిని ఆడిటోరియంలో చీఫ్ మినిస్టర్స్ కప్ – 2024 జిల్లాస్థాయి పోటీలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభకనబర్చి రాష్ర్టస్థాయిలో రాణించాలన్నారు. జిల్లా స్థాయి పోటీలు సోమవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. 16 ఈవెంట్స్ లో 323 మంది క్రీడాకారులు జిల్లా స్థాయిలో పాల్గొంటున్నారని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు 8వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారని వివరించారు....