30.9 C
Hyderabad
Monday, August 3, 2026

పాదయాత్రగా ఆలయాలను సందర్శించిన మాల్ తుమ్మెద గ్రామస్తులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నాగిరెడ్డిపేట్ : మండలంలోని మాల్ తుమ్మెద గ్రామానికి చెందిన సుమారు 150 మంది భక్తులు శనివారం ఒకే రోజు పాదయాత్ర చేస్తూ నాలుగు ఆలయాలను సందర్శించారు. తమ గ్రామం పాడి పంటలతో పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ గత 12 సంవత్సరాలుగా ప్రతి ఏటా డిసెంబర్ నెలలో మాల్ తుమ్మెద చెన్నకేశవ స్వామి ఆలయం నుండి పాదయాత్రగా వెళ్తూ ఆలయాలను సందర్శించి వస్తామనిఈ సంవత్సరం 13వ ఏటా కూడా 5 ఆలయాలను సందర్శిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. శనివారం మాల్ తుమ్మెద గ్రామంలోని వెంకటేశ్వర ఆలయం నుండి పాదయాత్రగా వెళుతూ మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలంలోని ముత్తాయి కోట సిద్ది రామేశ్వర ఆలయం, జక్కన్నపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కూచంపల్లి వెంకటేశ్వర ఆలయం, మాల్ తుమ్మెద చెన్నకేశ్వర ఆలయాలను దర్శించుకుంటున్నట్లు తెలిపారు. ఆలయాల సందర్శనలో పాల్గొన్న వారిలో మాల్ తుమ్మెద గ్రామానికి చెందిన నరేందర్ రెడ్డి, నాయి కోటి రాములు, కర్రే పెంటయ్య, చాకలి రాములు, బైండ్ల మోహన్, చాకలి ఏసులు గ్రామస్తులు పాల్గొన్నారు.

More articles

Latest article