పాదయాత్రగా ఆలయాలను సందర్శించిన మాల్ తుమ్మెద గ్రామస్తులు

బతుకమ్మ, నాగిరెడ్డిపేట్ : మండలంలోని మాల్ తుమ్మెద గ్రామానికి చెందిన సుమారు 150 మంది భక్తులు శనివారం ఒకే రోజు పాదయాత్ర చేస్తూ నాలుగు ఆలయాలను సందర్శించారు. తమ గ్రామం పాడి పంటలతో పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ గత 12 సంవత్సరాలుగా ప్రతి ఏటా డిసెంబర్ నెలలో మాల్ తుమ్మెద చెన్నకేశవ స్వామి ఆలయం నుండి పాదయాత్రగా వెళ్తూ ఆలయాలను సందర్శించి వస్తామనిఈ సంవత్సరం 13వ ఏటా కూడా 5 ఆలయాలను సందర్శిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. శనివారం మాల్ తుమ్మెద...