30.9 C
Hyderabad
Monday, August 3, 2026

వసతి గృహల డైట్ చార్జీలు నిత్యావసర ధరలకు అనుగుణంగా 20 శాతం పెంచాలి

Must read

📰 Generate e-Paper Clip

. . .  బాలుర వసతి గృహాన్ని సంధర్శించిన అర్బన్  ఎమ్మెల్యే ధన్ పాల్

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

వసతి గృహల డైట్ చార్జీలు 40 శాతం పెంచడం అభినందించదగ్గ విషయం . నిత్యావసర ధరలకు అనుగుణంగా ఇంకో 20 శాతం  పెంచే పునరాలోచన చేయాలనీ  నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. నగరంలోని న్యాల్కల్ రోడ్ లోని పీఎఫ్ ఆఫీస్ పక్కన ఉన్న ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ , అడిషనల్ కలెక్టర్ అంకిత్ తో కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు  గతంలో అర్బన్ లో వసతి గృహలను సందర్శించిన సమయంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని సాలి సాలని మెస్ ఛార్జిల వాళ్ళ విద్యార్థులు నష్టపోతున్నారని మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేయడం జరిగిందని గుర్తు చేశారు.గత ప్రభుత్వం హయాంలో సంక్షేమ హాస్టల్ల పరిస్థితి మురికి కుపాలుగా మారాయని, పురుగుల అన్నం తినాల్సిన పరిస్థితి ఉందని నేటికీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా ఎటువంటి మార్పు లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఆహారకల్తీతో అనేక మంది విద్యార్థులు హాస్పత్రుల పాలు కావడం జరిగిందని,అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. వసతి గృహ విద్యార్థులకు బుక్స్ లేవని వార్డెన్, విద్యార్థులు ఎమ్మెల్యే కి తెలుపగ తన ట్రస్ట్ ధ్వరా బుక్స్ అయ్యే మొత్తాన్ని చెల్లిస్తాని హామీ  ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, హాస్టల్ ఉపాధ్యాయులు, బీజేపీ కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

 

The diet charges of the hostels should be increased by 20 percent in line with the basic necessities

 

More articles

Latest article