30.2 C
Hyderabad

ఇసుక డంపులు సీజ్

Must read

📰 Generate e-Paper Clip

పోతంగల్, బతుకమ్మ: పోతంగల్ మండలంలోనే కోడిచెర్ల గ్రామంలో శుక్రవారం 50 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంపులను సీజ్ చేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. కోడిచర్ల గ్రామంలోని పోచమ్మ గుడి వద్ద, ఈరన్న కుంట వద్ద, పోతంగల్ వెళ్లే దారి పక్కన అక్రమంగా నిలువ చేసిన ఇసుకను గుర్తించి సీజ్ చేసి ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు. సీజ్ చేసిన ఇసుకను ఇళ్లు కట్టుకునే వారు, ప్రభుత్వ పనులు చేసేవారు డీడీ కట్టినట్లయితే వారికి వే బిల్లులు ఇచ్చి అనుమతి ఇస్తామని  తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక డంపు చేసిన, ఇసుక ఆక్రమంగా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Sand dumps siege

More articles

Latest article