- పిరమిడ్ ధ్యాన కమిటీ జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణ రెడ్డి.
బతుకమ్మ, నందిపేట్ : డిసెంబర్ 21-31 వరకు రంగారెడ్డి జిల్లా అన్మాస్‌పల్లిలో జరిగే పత్రీజీ ధ్యాన మహాయాగం కోసం ప్రజలను ఆహ్వానించేందుకు ధ్యాన రథయాత్ర నిజామాబాద్ జిల్లా నండిపేట మండలానికి శుక్రవారం చేరుకుంది. పిరమిడ్ ధ్యాన మందిరాలను సందర్శించి ధ్యానంలో పాల్గొనమని పిలుపునిచ్చరు. నందిపేటలో గల 200 మంది ధ్యాన బంధువులు రథాన్ని ఘనంగా స్వాగతించారు. కేదరేశ్వర ఆశ్రమ రాములు మహారాజు ప్రజలను ఈ యాగంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇట్టి యాత్ర లో జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.

