29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

లిల్లీపుట్ పాఠశాలలో ఫ్రూట్స్ డే సెలబ్రేషన్

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : లిల్లీపుట్ పాఠశాలలో విద్యార్థులకు ఫ్రూట్స్ డే సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ వివిధ రకాల పండ్లను తీసుకొని వచ్చారు. అదేవిధంగా వివిధ రకాల టీఎల్ఎం చాట్లతో అందరినీ ఎంతగానో అలరించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పండు వేషంలో వచ్చి దాని యొక్క ప్రత్యేకతను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రూట్స్ తో వివిధ రకాల ఐటమ్స్ చేసి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రతిదానికి గురించి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రీపై మరి విద్యార్థులకు ఈ విధంగా ప్రతి కార్యక్రమం నిర్వహించడం వల్ల విద్యార్థులకు ప్రతి అంశంపై ఖచ్చితమైన అవగాహన వస్తుందని, ముఖ్యంగా పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి అని విద్యార్థులు స్నాక్ ఐటమ్స్ లో భాగంగా ఒక పండును కచ్చితంగా తినాలని పండ్ల యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపాల్ దాసు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article