లిల్లీపుట్ పాఠశాలలో ఫ్రూట్స్ డే సెలబ్రేషన్
ఆర్మూర్, బతుకమ్మ : లిల్లీపుట్ పాఠశాలలో విద్యార్థులకు ఫ్రూట్స్ డే సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ వివిధ రకాల పండ్లను తీసుకొని వచ్చారు. అదేవిధంగా వివిధ రకాల టీఎల్ఎం చాట్లతో అందరినీ ఎంతగానో అలరించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పండు వేషంలో వచ్చి దాని యొక్క ప్రత్యేకతను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రూట్స్ తో వివిధ రకాల ఐటమ్స్ చేసి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రతిదానికి గురించి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ...