25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశం 

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ అనుసారం గురువారం ఎంపిడీఓ ఆఫీస్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించడం జరిగిందని ఎంపిడీఓ తెలిపారు. గత నెల 28న రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మండలంలోని 27 గ్రామపంచాయతీలకు సంబందించిన 244 వార్డుల వారిగా పోలింగ్ కేంద్రాల జాబితాను తయారుచేసినట్లు వివరించారు. ఆ తయారు చేసిన పోలింగ్ కేంద్రాల జాభితాను ఈనెల 7న ఎంపిడీఓ ఆఫీస్ తో పాటు ఆయా అన్ని గ్రామ పంచాయతీల్లో పబ్లిష్ చేయడం జరిగిందని వారికి వివరించి ఈ విషయమై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, నాయకులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కె. రమేష్, కె. రాజు, ఎస్. సత్యనారాయణ, బీఆర్ఎస్ ప్రతినిధులు డొంకంటి నర్సయ్య, ఎం. ఏ మోహిజ్, సీపీఎం ప్రతినిధి యన్. గోవర్ధన్,బీజేపీ ప్రతినిధులు లక్ష్మణ్ గౌడ్, టీ వీ యన్ రాజు, డీఎస్పీ ప్రతినిధి బి. బాబురావు లతో పాటు పర్యవేక్షకులు కె. భీమ్ రావు, సీనియర్ అసిస్టెంట్ ఎన్. ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article