రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశం
భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ అనుసారం గురువారం ఎంపిడీఓ ఆఫీస్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించడం జరిగిందని ఎంపిడీఓ తెలిపారు. గత నెల 28న రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మండలంలోని 27 గ్రామపంచాయతీలకు సంబందించిన 244 వార్డుల వారిగా పోలింగ్ కేంద్రాల జాబితాను తయారుచేసినట్లు వివరించారు. ఆ తయారు చేసిన పోలింగ్ కేంద్రాల జాభితాను ఈనెల 7న ఎంపిడీఓ ఆఫీస్ తో పాటు ఆయా అన్ని గ్రామ పంచాయతీల్లో...