25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆలయంలో భక్తి పాటలు పెడితే నోటీసులిచ్చారు

Must read

📰 Generate e-Paper Clip

  • చర్చ్ లో లౌడీస్పీకర్లు పెట్టి వాయిద్యాలతో ప్రేయర్ చేయమని అనుమతిని ఇచ్చారా?
  • పోలీసులను ప్రశ్నించిన మాల సంఘ సభ్యులు

భీమ్‌గల్, బతుకమ్మ : సనాతనం నుండి ఉన్న ఆలయంలో దేవుళ్ళ పాటలు పెడితే పోలీసులు నోటీసులు ఇచ్చారని మాల సంఘ సభ్యులు అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కాలనీలో ఉన్న గుడిలో రోజు రెండు పూటల రికార్డులు వేసి పాటలు పెడుతామని, తమ కాలనిలో ఉంటున్న పాస్టర్ పోలీసులకు ఫోన్ చేస్తూ తమపై ఫిర్యాదు చేస్తూ ఇబ్బందులు గురిచేస్తున్నారని అన్నారు.అదే పాస్టర్ అనుమతి లేకుండా చర్చి నిర్వహిస్తూ,రోజు ప్రేయర్ నిర్వహిస్తునారని ఆ పాస్టర్ పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. మున్సిపల్ అధికారులు తాము పదవ వార్డులో ఎవరికి కూడా చర్చికి అనుమతి ఇవ్వలేదని సమాచార హక్కు చట్టం ద్వారా తెలిపారని,ఈ విషయం పై అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా స్పందించడం లేదని అన్నారు.హిందూదేశంలో హిందువులకు అన్యాయం జరగడం బాదాకరమని అన్నారు.చర్చ్ నిర్వాహకులు కంప్లీట్ ఇస్తే స్పందించిన పోలీసులు మాకు నోటీసులు ఇచ్చినట్లు, మేము కంప్లెన్ట్ ఇస్తే ఎందుకు స్పందించడం లేదని సంఘ సభ్యులు ప్రశ్నించారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సంఘ సభ్యులకు న్యాయం చేయాలని లేకుంటే ఎస్సి,ఎస్టి కమిషన్ కి,జాతీయ కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

More articles

Latest article