ఆర్మూర్, బతుకమ్మ: జక్రాన్ పల్లికి చెందిన మల్లమారి ప్రశాంత్ కుమార్ రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ప్రశాంత్ కుమార్ ప్రస్తుతం కాంతి హై స్కూల్ లో పీఈటీగా పని చేస్తున్నారు. స్కూల్ కరస్పాండెంట్ వేల్పూర్ గంగారెడ్డి, జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్. మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోప్పరి వినోద్, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏం. గంగ మోహన్, సీనియర్ క్రీడాకారులు చిట్ల శ్యామ్, నాట్ట రంజిత్, రాజు బొంబాయి, మహేందర్ తదితరులు ప్రశాంత్ ను అభినందించారు.
