29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రతిభ వెలికి తీసేందుకే సీఎం  కప్ క్రీడలు 

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభ గల క్రీడాకారులను వెలికి తీసేందుకే ప్రభుత్వం ఈ సీ. ఎం కప్ టోర్నమెంట్ నిర్వహణ అని మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ అన్నారు. బుధవారం పట్టణం లోని కృషి పబ్లిక్ స్కూల్ లో నిర్వహిస్తున్న  మున్సిపల్ స్థాయి సీఎం కప్ -2024 క్రీడలను  ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేయాలని సంకల్పంతో పట్టణ మరియు గ్రామీణ స్థాయి క్రీడాకారులకు ప్రోత్సహిస్తుందని అన్నారు. మున్సిపాలిటీ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ వై.రామకృష్ణ కౌన్సిలర్ సిహెచ్ గంగాధర్. ధారావత్ లింగయ్య. సతీష్ గౌడ్. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు, జె జె నర్సయ్య. అనంత రావు. మల్లెల లక్ష్మణ్. సతీష్. భూషణ్. ఎంఈఓ స్వామి. మేనేజర్ నరేందర్. టోర్నమెంట్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ ఎస్ .రమణమూర్తి. అజిత్ రెడ్డి. పీటీలు లింగం. నరేష్. గంగాధర్. సత్యనారాయణ. రోహిత్. క్రీడాకారులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

More articles

Latest article