29 C
Hyderabad
Monday, August 3, 2026

ఆరు హామీలు ఎగ్గొట్టడమే కాంగ్రెస్ సిద్ధాంతం

Must read

📰 Generate e-Paper Clip

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

బతుకమ్మ:బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక ట్యాంక్బండ్ వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి భరాస పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. కార్యక్రమానికి జుక్కల్ మాజీ శాసనసభ సభ్యులుహన్మంతు షిండే హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కవులు కళాకారులు విద్యావంతులతో చర్చించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పుట్టిన గడ్డను మాతృసమానంగా చూసే సంస్కృతి మనది. అది ఊరు, రాష్ట్రం, దేశం ఏదైనా తల్లిగా భావిస్తాం. మొత్తం భూమండలాన్నే భూదేవత అని కొలుస్తాం. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పిస్తాం. ప్రేమ గల్ల తల్లి కోసం త్యాగాలకు వెనుకాడం. అటువంటి తల్లికి రూపం ఇచ్చి పూజించుకోవడం కొత్తకాదు. అనాదిగా వస్తున్న సంప్రదాయమే. స్వాతంత్య్రానంతరం భారతమాతకు ఎందరో మహానుభావులు మేధస్సును రంగరించి భారతమాత రూపమిచ్చారు. చేతులకు గాజులు, మెడలో ఆభరణాలు, తలపై కిరీటంతో భారతమాతను దేవతామూర్తిగా సకల సౌభాగ్యాలతో తయారు చేశారు. ధీరత్వానికి, వీరత్వానికి ప్రతీకగా దుర్గామాత రూపంలో భారతమాతను పూజిస్తుంటాం. భారతమాతకు జై అనే నినాదం వినిపించినా, ఆలపించినా ఉద్వేగానికి గురవుతాం. భారతమాత విగ్రహానికి భారతదేశం సుసంపన్నమైన దేశంగా, వీరత్వంతో, ధీరత్వంతో ప్రపంచంలో వెలుగొందాలనేది విగ్రహ రూపకర్తలైన మహనీయుల ఉద్దేశం. ఇలా దేశంలోని ఏ రాష్ట్రమాత విగ్రహం చూసినా దేవతా మూర్తిగానే దర్శనమిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ సహా ఏ రాష్ట్రమాతను చూసినా వైభవం ఉట్టిపడేలా ఉంటుంది. కానీ అద్భుతంగా విలసిల్లిన తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో కొత్త విగ్రహం ప్రతిష్ఠించడం, ఆ ప్రతిమ దీనస్థితిని ప్రతిబింబించేలా ఉన్నదంటూ అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చడం చాలా బాధాకరమని రానున్న రోజుల్లో గవర్నమెంట్ లో మార్పు జరగగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని , కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని సకల మర్యాదలతో గాంధీభవన్ కు పంపించడం ఖాయమన్నారు. ఇచ్చిన హామీలను నెర వేర్చి స్తోమత లేక కేవలం ప్రజల దృష్టిని మరల్చెందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన అన్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి ప్రజలకు కావలసిన పథకాలను ఇంప్లిమెంటేషన్ చేయాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గం లోని అన్ని మండలాల భరసా పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

The Congress doctrine is to live up to the six guarantees

More articles

Latest article